వికలాంగుల ఫించన్ రూ.6వేలకు పెంచాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
వికలాంగుల ఫించన్ రూ.6వేలకు పెంచాలి

– దివ్యాంగుల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికలాంగులకు అందిస్తున్న ఫించన్ ను రూ. 6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ వేధిక డిమాండ్ చేసింది. బుధవారం వేదిక ప్రతినిధులు తాండూరు ఆర్డీఓ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు బండారి అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న ఫించన్ పెంచుతామని హామి ఇచ్చిందన్నారు.

ఇప్పటికి 7 నెలలు అవుతున్న అందించడం లేదన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఫించన్ వాటాలో అందిస్తున్న రూ.300లను రూ.3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు మొత్తం రూ. 6వేల ఫించన్ అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు వికలాంగులకు ప్రభుత్వ పథకాల్లో 3శాతం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల పరిరక్షణ వేదిక నాయకులు సుందర్, యాదయ్య, ఖాజా పాష, గణేష్, ఇందిరా, విజయ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆదర్శవంతమైన సేవలందించాలి