మినీ ట్యాంక్‌బండ్‌లో బతుకమ్మ నిమజ్జన వేడుకలు
– పకడ్బందీ ఏర్పాట్ల కోసం పరిశీలించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్లచెరువులోని మిని ట్యాంక్‌బండ్‌లో బతుకమ్మ నిమజ్జన వేడుకలు నిర్వహించేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం దృష్టిసారిస్తోంది. ఇందుకోసం తీసుకోబోయే సదుపాయాలు, సౌకర్యాలపై బుధవారం మున్సిపల్ శానిటరీ ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్ గొల్లచెరువును సందర్శించారు. వార్డు కౌన్సిలర్ రాముకృష్ణతో కలిసి మిని ట్యాంక్‌బండ్‌లో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనం కోసం తీసుకోసే చర్యలపై ఆరా తీశారు. మున్సిపల్ ఉన్నతాధికారులతో కలిసి నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. తాండూరులోని గొల్లచెరువులో గత రెండేళ్ల క్రితమే బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేశారు.
