అభివృద్ధికి పక్కా ప్రణాళికలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధికి పక్కా ప్రణాళికలు..!
– ఒక యేడాదికి ముందే రూ. 1500 కోట్ల పనుల పూర్తి
– ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగు
– నియోజకవర్గంలో పారదర్శకంగా ఎస్‌ఐఆర్‌
– స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం
– నిరుద్యోగ యువత కోసం కోచింగ్ సెంటర్లు
– వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ తాండూరులో పారదర్శకంగా పూర్తి అయ్యిందని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 65 వేల ఓట్లు తొలిగిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ పక్రియ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని అన్నారు. తాండూరు అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగడం జరుగుతుందని, ఇప్పటికే మంజూరు చేసిన రూ. 1500 కోట్ల పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికలకు ఒక యేడాది ముందే అన్ని పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడింది తానే అని తెలిపారు. తాండూరులోని ప్రభుత్వ ఆసుప్రతిని మెరుగు పరిచి.. కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే కృతనిశ్ఛయంతో ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలోనే కాగ్నా నది నుంచి నీరును అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మురుగునీటి శుద్ది కర్మాగారాలు(ఎస్‌టీపీ) నిర్మించేందుకు దృష్టిసారిస్తున్నామని అన్నారు.

తాండూరులోని నిరుద్యోగుల కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి.. ఎస్ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే విధంగా తాండూరులో అక్రమార్కలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అక్రమ ఇసుక రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్‌లో ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురికాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తామని తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చిస్తూ.. దేశంలో వచ్చేఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని, జెన్‌జీ ప్రభావం ఎన్నికలపై పడుతుందని అన్నారు.

దేశానికి రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఖాసిం అలీ తదితరులు ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి..!