అమ్మా.. బయలెల్లినాదో…!

తాండూరు రాజకీయం వికారాబాద్

అమ్మా.. బయలెల్లినాదో…!
– శోభాయమానంగా పల్లకిసేవ ఊరేగింపు
– అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
– దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా.. బయలెల్లినాదో.. కాచే తల్లి.. బయలెల్లినాదో.. అంటూ తాండూరు పట్టణంలోని కాళికాదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.

జాతర ఉత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం ఈఓ నరేందర్ అమ్మవారి ఉత్సవ ఊరేగింపు వేడుకలు వైభోగంగా జరిగాయి. కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కన్నుల పండగలా ప్రారంభమయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దేవాలయంలో వెలసిన అమ్మవారికి పట్టు వ ్రస్తాలను సమర్పించారు.

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవలయం ముందు నుంచి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. ఉత్సవ ఊరేగింపులో భక్తులు, పుర ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవాలయం నుంచి మార్వాడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్ తదితర ప్రాంతాల మీదుగా అమ్మవారి ఊరేగింపు కొనసాగనుంది. ఊరేగింపు ముందు డోలు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు ప్రతి యేడాది మాదిరిగానే జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం దేవాలయంలో అన్నదాన ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, నాయకులు, సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాండూరు ప్ర‌గ‌తికి కృషి