సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..!
– తాండూరులో వైభవంగా గురిపౌర్ణిమ
– షిర్డి సాయిబాబా దేవాలయంలో పోటెత్తిన భక్తులు
– దర్శించుకున్న చైర్ పర్సన్, నేతలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో భక్తులు గురిపౌర్ణిమను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఆదివారం గురుపౌర్ణిమి సందర్భంగా తాండూరు కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన షిర్డి సాయిబాబా దేవాలయంలో సాయినాథ్‌ మహరాజ్‌కీ జై అంటూ సాయి నామస్మరణ మార్మోగింది. ఆలయంలో ఉదయం మేలుకోలుపు, సామూహిక పుష్పాభిషేకం, మహానైవేద్యం, మధ్యాహ్నం మధ్యాహ్న హారతి, సాయంత్రం దూపహారతి వంటి కార్యక్రమాలను ఆలయ కమిటి సభ్యులు భక్తిశ్రద్ధలతో చేప‌ట్టారు.

గురుపౌర్ణమిని పురస్కరించుకుని తాండూరు పట్టణ ప్రజలు, కోకట్ గ్రామస్తులు, వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. సాయిబాబా దర్శనార్థం బారులుతీరారు. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఆలయంలో సాయిభక్తులు భక్తి పారవశ్యంతో భజన కీర్తనలు ఆలపించారు.

దర్శించుకున్న చైర్ పర్సన్, నేతలు
మరోవైపు కోకట్ రోడ్డు మార్గంలోని షిర్డి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేవాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, నాయకులు సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్ అంతారం లలిత, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, నేతలు మాజీ డిపిసి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మనోహర్ యాదవ్, జొన్నల వినోద్, బంటు మల్లప్ప, మాధవరెడ్డి, మల్రెడ్డి, భవనాల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సాయినాథుని సేవలో శంకరన్న..!