రేపు విద్యుత్ అంతరాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు విద్యుత్ అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు విద్యుత్ అంతరాయాన్ని విధిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళవారం తాండూరు విద్యుత్ శాఖ అధికారులు ప్రకించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 9-30 గంటలకు విద్యుత్ సరఫరా స్థంభిస్తున్నట్లు వెల్లడించారు. తాండూరులోని 220/132/33 కేవీ సబ్‌ స్టేషన్లలో మరమర్మత్తులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అంతరాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గంలోని తాండూరు మండలం, పెద్దేముల్ మండలం, బషీరాబాద్‌ మండలాలతో పాటు తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు సబ్‌ స్టేషన్‌లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రకటించారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

పొలంలో పేకాట..!