దంతాల మెరుపుకు ఆరు చిట్కాలు

ఆరోగ్యం

మ‌నిషిలో ఎదుటి వారిని ఆక‌ర్షించేది చిరున‌వ్వే… మన దంతాలు మెరుపుపై ఆ ఆక‌ర్ష‌ణ ఆధార‌ప‌డి ఉంటుంది. దంతాలు పసుపు రంగు మచ్చలు ఉన్నట్లయితే.. మనస్ఫూర్తిగా నవ్వడం కూడా కష్టంగానే ఫీలవుతుంటారు. దంతాలు తెల్లగా ఉంటే.. ఆ నవ్వుకు మరింత ఆందం తోడవుతుంది. అదే అందుకే చాలా మంది తమ దంతాలను తెల్లగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దంతాలను ముత్యాల్లా చేసుకోవడం నిపుణులు ఇచ్చే కొన్ని సూచనలు వాటిని పాటిస్తే స‌రి. మరి మీ ప్రకాశవంతమైన చిరునవ్వును పునరుద్ధరించడానికి, దంతాలను తెల్లగా మార్చే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి
మీ దంతాలకు పసుపు రంగు వచ్చేలా చేసే టీ, వైన్ వంటి టానిన్‌లు కలిగిన ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఆమ్లత్వంతో కూడిన ఆహార పదార్థాలు కూడా దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి. చక్కెర పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. పాలు, పాల ఉత్పత్తులు, జున్ను, పెరుగు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార దార్థాలను ఎక్కువగా తీసుకోండి. అలాగే.. వాట్ నట్స్, బాదం, పుట్టగొడుగులు, గుడ్లు, చిలగడదుంపలు, క్యారెట్లు తినండి.

ధూమ‌పానం మానుకోవాలి..
దంతాల రంగు మారడంలో ధూమపానం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ధూమపానాన్ని వదిలేయండి. ఎంత ఎక్కువ ధూమపానం చేస్తే.. మీ దంతాలు అంతగా ముదురు పసుపు రంగులోకి మారిపోతాయి.

బేకింగ్ సోడాతో మార్పు..
బేకింగ్ సోడాలో దంతాలను తెల్లగా మార్చే గుణాలు ఉన్నాయని అంటారు. ఈ బేకింగ్ సోడాతో పళ్లు తోమడం చేయాలి. అలా కొద్ది రోజులు చేశాక.. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దంతాలపై ఉన్న పసుపు రంగు క్రమంగా తొలగిపోతుంది. అలా పళ్లు తెల్లగా మారుతాయి.

నూనెల‌తో ఫ‌లితం..
కొబ్బరి నూనె పుక్కిలింత అనేది సాంప్రదాయక పద్ధతి. కొబ్బరి నూనెలో సూక్ష్మ జీవుల నిరోధక లక్షణాలు ఉన్నాయి. చిగుళ్లు, దంతాలను రెండింటినీ బలంగా చేస్తుంది. మీ నోటిలో ఒక చెంచా కొబ్బరి నూనె తీసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు గార్గ్ చేయాలి. లేదా టూత్ బ్రష్‌లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి బ్రష్ చేయండి. పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేసిన కొద్ది రోజుల తరువాత ఫలితాలను మీరే గమనించవచ్చు.

రోజూవారి నియ‌మాలు త‌ప్ప‌ని స‌రి..
తెల్లటి దంతాలు కావాలంటే.. రోజూ సరిగా బ్రష్ చేసుకోవాలి. టూత్‌పేస్ట్, ఫ్లోసింగ్, మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం ఇంకా మంచిది. ప్రతీ రోజూ ఉదయం, రాత్రి పడుకకునే ముందు బ్రష్ చేయండి. ఎలక్ట్రిక్, సోనిక్ టూత్ బ్రష్‌లు రెండూ సాంప్రదాయ టూత్ బ్రష్‌ల కంటే ఎక్కువగా దంతాలపై ఉన్న పసుపు రంగు మరకలను తొలగించడంలో ఉపకరిస్తాయి.