బీఆర్ఎస్ పార్టీవి కుతంత్ర రాజకీయాలు..!
– కాంగ్రెస్ పాలనను దిగజార్చేందుకు కుట్ర
– రైతుల ముసుగులో ఉనికి దర్నాలు
– ఖండించిన తాండూరు కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ అందిస్తున్న పాలనను ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ కుతంత్ర రాజకీయాలకు పాల్పడుతుందని తాండూరు నాయకులు విమర్శించారు. రేవంత్ సర్కారు పాలనను దిగజార్చేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దర్నాలను శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖండించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, సీనీయర్ నాయకులు ఉత్తమ్ చంద్, కరణం పురుషోత్తం రావు తదితరులు మాట్లాడుతూ ఎన్నికల్లో హామి ఇచ్చిన విధంగా రైతులకు రుణమాఫీ అమలు చేసిందని అన్నారు. మూడు విడతల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా 89435 మంది లబ్ధిదారులకు 744 కోట్ల రూపాయలు ఇందులో తాండూర్ నియోజకవర్గనికి రెండు విడుదల్లో కలిపి 14139 మంది లబ్దిదారులకు సుమారు రూ. 103 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల సాంకేతిక లోపాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోయినా అలాంటి రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం, రైతు వేదిక క్లస్టర్ లో నోడల్ అధికారులను నియమించాడం జరిగిందని తెలిపారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాల్సి ఉంటుందని కేటీఆర్, హరీష్ రావులు కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికి కోసం దర్నాలు చేస్తుందన్నారు. తాండూరులో పార్టీ ఇంచార్జ్ లేకుండానే దర్నాను ముగించారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై వాఖ్యలు చేయడం పట్ల వారిపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని జుంటుపల్లి, చంద్రవంచ, కందనెల్లి సబ్ స్టేషన్లకు శంఖుస్థాపన చేయడం జరిగిందని, తాండూరు మండలం జీన్గుర్తి సబ్ స్టేషన్ ప్రారంభించడం కూడ జరిగిందని గుర్తుచేశారు. దీంతో పాటు మున్సిపల్ పరిధిలో కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ కాఫీలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మున్సిపల్ పరిధిలో త్రాగు నీటి సమస్య తీర్చడానికి అమృత్ 2.0 కింద 27.50 కోట్లు, గొల్ల చెరువు సుందరికరణకు 4.88 కోట్లు రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీనీ, ఎమ్మెల్యేను విమర్శించే అర్హత, స్థాయి వాళ్లకు లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేపై దిగజారుడు రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మార్కేట్ కమిటీ చైర్మన్లు అంజయ్య, మాధవ రెడ్డి, వైస్ చైర్మన్లు నర్సి రెడ్డి, చందర్, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి, లొంక నర్సింహులు, ఎ బ్లాక్ ప్రైసెడెంట్ రాము, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

