సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌కు జరిమాన
– రోడ్డు ప్రమాదం కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో యువతి మరణానికి కారణమైన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌కు రూ. 5500ల జరిమాన విధిస్తూ తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న తీర్పు వెలువరించినట్లు పట్టణ ఎస్ఐ గిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ గిరి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2014లో తాండూరు పట్టణానికి చెందిన కల్వ రవీందర్ తన బైకుపై తన కూతురు సౌమన్యను కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్నారు. పట్టణంలోని రాజా రాణి వైన్స్ వద్దకు రాగానే వెనుకాల కోడంగల్ నుంచి తాండూర్ వైపు కర్ణాటకకు చెందిన సిమెంట్ ట్యాంకర్ వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌమ్య తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ హనుమంతు అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగిందని ఫిర్యాదు రావడంతో అప్పటి ఎస్ ఐ నాగార్జున కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను రిమాండుకు తరలించారు. శుక్రవారం తాండూరు మెజిస్ట్రేట్ టీ. స్వప్న కేసు వాదనలు వినిపించిన తర్వాత నేరస్తునికి 5500/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ గిరి తెలిపారు.


