గ్రేన్‌ అసోసియేషన్ గణేష్‌ సందడి

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రేన్‌ అసోసియేషన్ గణేష్‌ సందడి
– వినాయకున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సన్మానించిన నేతలు, సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు సోమవారం తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌ గ్రైన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్‌ సాయిపూర్ బాల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రాములు గౌడ్, కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్, జాయింట్ సెక్రటరీ భోజిరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీధర్, కోశాధికారి బానకారి కృష్ణ, మాజీ అధ్యక్షులు కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, మల్లేపల్లి వెంకటేశం, జైపాల్ రెడ్డి, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భారత్‌లో తొలి మంకీ ఫాక్స్ కేసు