రామ మందిర అభివృద్ధికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

రామ మందిర అభివృద్ధికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– దేవాలయ పునర్ నిర్మాణ పూజకు హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిర దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్ నిర్మాణంకు శంకుస్థాపన జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణ పరిధిలో జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరులోని ఏకైక పురాతన శ్రీ రామ మందిర పునర్ నిర్మాణంకు, దేవాలయ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్, నాయకులు రవిశిందే, బోయరాజు, బంటు వేణు, ఉదయ్ భాస్కర్, పండరి, శ్రీనివాస్ గౌడ్, దేవాలయ కమిటి సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న నర్సింహారెడ్డి