
విరాళాలతో రామభక్తి..!
– రామ మందిర్ పునర్ నిర్మాణానికి చేయూత
– ఆర్థిక సాయం అందిస్తున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఏకైక రామ మందిరంపై భక్తులు విరాళాలు అందిస్తూ భక్తిని చాటుకున్నారు. ఇటీవలే రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

దేవాలయ పునర్ నిర్మాణం కోసం భక్తులు స్వఛ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వస్తూ రూపేణా, నగదు రూపేణా తోడ్పాటు అందిస్తున్నారు. దేవాలయ పునర్ నిర్మాణం కోసం దేవాలయ కమిటి విరాళాలను సేకరిస్తున్నారు. వారి పిలుపుకు పలువురు భక్తులు స్పందిస్తున్నారు. తాజాగా తాండూరుకు చెందిన గుండా రాజేశ్వర్ వ్యాపారి తన వంతుగా రూ. 25000 విరాళం అందించారు. అదేవిధంగా ఆకారపు శ్రీనివాస్ అనే భక్తుడు కూడా తనవంతుగా రూ. 51వేలు విరాళం అందించారు. అదేవిధంగా హరళయ్య సమాజ్ వినాయక ఉత్సవ కమిటీ వారు తమ వంతు సహాయంగా 5000 రూపాయలను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చాలా మంది భక్తులు రామునిపై కూడా భక్తి చాటుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు రాముడు సేవలో పాల్గొని దేవాలయ పునర్ నిర్మాణంలో వస్తూ రూపేణ, నగదు రూపేణా సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కే.శేఖర్, బోయ రాజు, యాదగిరి చారి, ఉపాధ్యక్షులు దోమ శ్రీనివాస్, కే వెంకటేష్, కోశాధికారి, అంజిల్ రెడ్డి, ఆనంద్ కుమార్ ప్రధాన కార్యదర్శిలు, మొగులప్ప, రాము చారి, ప్రవీణ్ కుమార్ సభ్యులు, హనుమయ్య,నర్సింలు, భద్రప్ప, కృష్ణ, గోపాల్, చందు, శ్రావణ్, అనిల్ కుమార్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

