భారత్‌లో తొలి మంకీ ఫాక్స్ కేసు

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

భారత్‌లో తొలి మంకీ ఫాక్స్ కేసు
– వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
– రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తం
దర్శిని డెస్క్ : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను ఉన్నట్లు అనుమానించిన కేసులో బాధితునికి (మంకీపాక్స్) పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉనికిని నిర్ధారించిందని తెలిపింది. మంకీ ఫాక్స్ తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ప్రయాణించిన వారిలో ఈ బాధితుడు ఉన్నట్లు తెలిపింది.. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ సదుపాయంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో భారత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టులు, రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలిచ్చింది. అలాగే మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్‌, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అప్రమత్తం చేసింది.

ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకుముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు పేర్కొంది.. ఈ కేసు మునుపటి 30 కేసుల మాదిరిగానే ఇదికూడా ఒకటని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

ఇదికూడా చదవండి…

మనోహర్ రెడ్డి గొప్ప మనసు..!