మూడు సంఘాల సామాజిక సృహ భేష్
– మెగా రక్తదాన శిబిరానికి స్పందన
– సంఘాలకు వెలువెత్తిన అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని లయన్స్ క్లబ్, మార్వాడి యువమంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం సంఘాల సామాజిక సృహ భేష్ అంటూ అభినందనలు వెలువెత్తాయి. ప్రతి యేడాది గాంధీ జయంతికి మూడు సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఈయేడాది కూడా మహాత్మ గాంధీ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల జయంతిని పురస్కరించుకుని రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బుధవారం పట్టణంలోని బాలాజీ మందిర్‌లో ఏర్పాటు చేసిన శిబిరానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు హాజరై ప్రారంభించారు.

మెగా వైద్య శిబిరంలో ప్రజలు, యువకులు భారీగా తరలివచ్చి రక్తదానం చేశారు. దాదాపు 54 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లయన్స్ క్లబ్, మార్వాడి యువమంచ్, ఆర్యవైశ్య యువజన సంఘాలు చె స్తున్న సామాజిక సేవలను అభినందించారు. ప్రతియేడాది రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, కార్యదర్శి వీరప్రసాద్, కోశాధికారి అసద్ అలీ, క్లబ్ సీనీయర్ సభ్యులు సల్లా దామోదర్, ఓం ప్రకాష్ సోమాని, మార్వాడి యువమంచ్ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్డా, జాతీయ సభ్యులు మన్మోహన్ సార్డా, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు భానుకుమార్, కార్యదర్శి పునీత్, కోశాధికారి వంశీ, జిల్లా ఆసుపత్రి వైద్య బృందం, ఆయా సంఘాల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

