కుల గణనకు రెడీ..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

కుల గణనకు రెడీ..!
– 50 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
– ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో బృందం
– సర్వేలో ఉపాధ్యాయులకు టార్గెట్
– ఏమేం సర్వే చేస్తారంటే..?

హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కుల గణన చేపట్టేందుకు సిద్దమైంది. వచ్చేనెల 6వ తేది నుంచి ఇంటింటి సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. మొత్తం 50 ప్రశ్నలతో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారి చేసింది. 6 నుంచి నిర్వహించే సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేకు ఉపాధ్యాయులను గణకులుగా వినియోగించుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఈ సేవలకుగానూ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందితో బృందాన్ని రెడి చేసుకోవాలని సూచించారు.

అంతకుముందు సర్వేపై ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలఫై అవగాహన కల్పించనున్నారు. సర్వే విషయంలో గ్రామాల్లో డప్పు చాటింపు, పట్టణంలో ప్రచారాలను నిర్వహించనున్నారు. రోజూ జరిగే పర్యవేక్షణ నిర్వహించనున్నారు. సర్వేలో పాల్గొనే ఉపాద్యాయులకు పాఠశాల వేళల తర్వాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజూ 5 నుంచి 7 ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించేలా టార్గెట్ విధించారు. ప్రజల సామాజిక, ఆర్థిక, ఆదాయ, విద్య, రాజకీయ స్థితిగతుల వివరాలన్నీంటిని సర్వేలో నమోదు చేయనున్నారు.

సర్వేలో నమోదు చేసే వివరాలివే..
ప్రతీ ఇంటికి వెళ్లి నిర్వహించే సర్వేలో 7 పేజీలతో 54 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. కుటుంబ యజమాని నుంచి మొదలుకొని అతనికి సంబంధం ఉన్న వారి కులం, ఉప కులం, మాతృభాష, విద్య, ఆస్తుల వివరాలు, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వివరాలు, ఇలా అనేక వివరాలను సేకరించనున్నారు.

ఇదికూడా చదవండి…

జిల్లాలో కొత్త పోలీస్టేషన్లు..!