కేసీఆర్‌కు జేజేలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కేసీఆర్‌కు జేజేలు..!
– ప్లీన‌రీ స‌మావేశంలో నేత‌ల సంద‌డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జేజేలు ప‌లికారు. టీఆర్ఎస్ పార్టీ ద్విద‌శాబ్దిని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం హైద‌రాబాద్‌లోని హైటె్క్న్ సమావేశంలో తాండూరు టీఆర్ఎస్ నేత‌లు సంద‌డి చేశారు. ఈ ప్లీన‌రీ స‌మావేశానికి తాండూరు నుంచి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, ఎంపీపీలు అనితా ర‌వింద‌ర్‌గౌడ్, క‌రుణ అజ‌య్ ప్ర‌సాద్, అనురాధ‌, బాలేశ్వ‌ర్ గుప్త‌, జెడ్పీటీసీలు గౌడి మంజుల వెంక‌టేశం, శ్రీ‌నివాస్‌రెడ్డి, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, డీసీసీబీ ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా డైరెక్ట‌ర్
ర‌వీంద‌ర్ గౌడ్, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), సీనీయ‌ర్ నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, న‌ర్సిరెడ్డి, బంటారం సుధాక‌ర్, న‌ర్సిరెడ్డి(రాజు), కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్, స‌ర్పంచుల సంఘం అధ్య‌క్షులు రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి, టీఆర్ఎస్ మండ‌లాల అధ్య‌క్షులు రాందాస్, కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్, రాములు నాయ‌క్, మ‌ల్లారెడ్డి, వివిధ మండ‌లాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ స‌మావేవంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులుగా, సీఎం కేసీఆర్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డంతో స‌మావేశంలో పాల్గొన్న నేత‌లంతా కేసీఆర్‌కు అనుకూలంగా జేజేలు ప‌లికారు.