విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
– తాండూరు విద్యుత్ ఏడీ శంకర్
– కన్జ్యూమర్ డేలో 16 ఫిర్యాదులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ అన్నారు. ఆదివారం నవంబర్ 3వ తేదిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల వినియోదారులు తరిలివచ్చి ఫిర్యాదులు చేసుకున్నారు. ముఖ్యంగా డీడీల తిరస్కరణ, అధిక బిల్లులు, లో ఓల్టేజ్, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయాలంటూ తదితర వాటిపై మొత్తం 16 ఫిర్యాదులు అందాయి.
ఈ సందర్భంగా ఏడీ శంకర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగ దారులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అందుకే యేడాదిలో ఒకరోజు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. తాజాగా వచ్చిన ఫిర్యాదుల్లో వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రఘువీర్ రెడ్డి, బషీరాబాద్ ఏఈ అరవింద్, పెద్దేముల్ ఏఈ రఘువీర్ రెడ్డి, మహేష్, జీఏఓ సేనాపతి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

