పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
– తాండూరు కోర్టులో మౌళిక సదుపాయాలకు తోడ్పాటు
– హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక
– తాండూరులో అడిషనల్ కోర్టు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు సివిల్ జడ్జి న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన అడిషనల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ వికారాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు న్యాయమూర్తి భీమపాక నగేష్ కు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ మాట్లాడారు. దేశంలోని న్యాయస్థానాలలో కేసులు పేరుకుపోతున్నాయని అన్నారు.

ప్రస్తుతం ఉన్న కేసులు పరిష్కారం కావాలంటే 33 ఏండ్ల కాలం పడుతుందని అన్నారు. అత్యధికంగా మానవ సంబంధాలు పడిపోవడంతో సొంతవాళ్లపైనే కేసులు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. ఈ కేసుల పరిష్కారానికి న్యాయవ్యాదులు కృసి చేయాలన్నారు. అదేవిధంగా తాండూరులోని అడిషన్ కోర్టు, సబ్ కోర్టులలో సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. సదుపాయాలు, మౌళిక సదుపాయాలకు సంబంధించి వినతులు అందిస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

న్యాయమూర్తులకు సన్మానం
అనంతరం తాండూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్, వికారాబాద్ జిల్లా న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించారు. అదేవిధంగా తాండూరు సివిల్ జడ్జి న్యాయమూర్తి శివలీల, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వై స్ చైర్మన్ సునీల్ గౌడ్, రాష్ట్ర ప్రతినిధులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

కేవీసీఎస్ విద్యార్థుల ప్రదర్శన
మరోవైపు వినాయక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని పోటీమహారాజ్ దేవాలయ ఆవరణలో కొనసాగుతున్న కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. వేదిక వద్దకు హాజరవుతున్న న్యాయమూర్తులకు విద్యార్థులు గౌరవ వందనం సమర్పిస్తూ స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ ముందు స్వాగత నృత్య ప్రదర్శన ఇచ్చారు. విద్యార్థుల ప్రదర్శనను హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మఠం చంద్రశేఖర్, పాశం రవికుమార్, శ్రీనివాస్, సీనీయర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి రాకపట్ల పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇదికూడా చదవండి…

మునగాకు లడ్డు వెరి గుడ్డు..!