అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ
– డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ రవీంద్ర యాదవ్
– తాండూరులో ఎయిడ్స్ దినోత్సవం, అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవగాహన, అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ సాధ్యపడుతుందని వికారబాద్ డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ రవీంద్ర యాదవ్ అన్నారు. ఆదివారం డిసెంబర్ 1 ఎయిడ్స్ దినత్సవాన్ని పురస్కరించుకుని టేక్ రైట్ పాత్ అనే నినాదంతో ఎయిడ్స్ నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎయిడ్స్ నియంత్రణపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీప్యూటీ డీఎంఅండ్ హెచి రవీంద్ర యాదవ్, పలువురు వైద్యులు మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు.
నివారణ కంటే నిరోధన చాలా ఉత్తమైనదని పేర్కొన్నారు. గతంలో కన్నా వ్యాధి నిరోధనపై ప్రపంచ దేశాలు పురోగతిని సాధిస్తున్నాయన్నారు. ప్రయోగాల అనంతరం కొత్త టీకాలు కనిపెడుతున్నారు. త్వరలోనే మన వద్ద కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయినప్పటికి ఎయిడ్స్ మహమ్మారిని ప్రారద్రోలేందుకు అందరు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

