ఇందిరమ్మ కాలనీలో దారుణం
– భర్తను హత్య చేసిన భార్య
– తాగి వేధిస్తున్నాడని రాయితో దాడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తాగి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను రాయితో మోది హత్య చేసింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. యాలాల ఎస్ఐ గిరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఖాజా మియా (30), భార్య అర్షా భేగం, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఖాజా మియా మద్యానికి బానిక కావడంతో పాటు తాగి భార్యను వేధించే వాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య మనస్పర్థలు వచ్చాయి. తాజాగా మళ్లీ ఖాజా మియా తాగి వేధించడంతో విసుగు చెందిన అర్షాభేగం బండరాయితో అతని తలపై బలంగా మోదింది. రక్తపు మడుగులోనే ఖాజా మియా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న యాలాల ఎస్ఐ గిరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి..

