భూకంపంతో ఉలిక్కి ప‌డిన‌ ఉత్తర తెలంగాణ

తెలంగాణ హైదరాబాద్

ఉలిక్కి ప‌డిన‌ ఉత్తర తెలంగాణ
– జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ఉలిక్కి ప‌డింది. ఈ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం స్వల్ప భూకంపం వ‌చ్చింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలు, పెద్దపల్లి రామగుండం కార్పోరేషన్‌,
గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. స‌రిగ్గా సాయంత్రం 6.49 గంటల సమయంలో నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇండ్లలోని వస్తువులు పడిపోవడంతో జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. జగిత్యాల పట్టణంలోని కొన్ని వార్డులతో పాటు పోరండ్ల, కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట, కోరుట్ల పట్టణం, మెట్‌పల్లి చైతన్య నగర్, బీర్‌పూర్‌, మల్యాల మండల కేంద్రం.. లంబాడిపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలాలు, మంచిర్యాల జిల్లా
లక్సెట్టిపేటలోనూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్‌కు 199 కిలోమీటర్ల దూరంలో, భూమికి 77 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నది.