మహాకుంభ మేళాలో తాండూరు భక్తులు

తాండూరు రాజకీయం వికారాబాద్

మహాకుంభ మేళాలో తాండూరు భక్తులు
– బంటు మల్లప్పతో కలిసి వెళ్లిన సైన్యం
– త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గతనెల రోజుల నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న మ హాకుంభ మేళాకు తాండూరు భక్తులు పోటెత్తుతున్నారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో బంటు మల్లప్ప సైన్యం సభ్యులు మహాకుంభ మేళాకు తరలివెళ్లారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్ రాజ్లో తన మిత్ర బృందంతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి అయోధ్య, కాశీలో కూడా పుణ్యక్షేత్రాల్లో దేవుళ్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బంటు మల్లప్ప మాట్లాడుతూ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు మల్లప్ప సంపత్, యాదప్ప, బంటు వెంకటేష్, బంటు హన్మంతు, రాజు, మునీంద్ర, మల్కప్ప, మణికంఠ, హరిబాబు, రవీందర్, నరేందర్, రాములు, గోపాల్, రవి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

వాహ్.. అన్షారా కొనైనే..!