శ్రీశైలం మల్లన్న సన్నిధిలో తాండూరు నాయకులు..!
– దర్శించుకున్న మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు
– మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలంలోని మల్లన్న సన్నిధికి తాండూరు నాయకులు, భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం తాండూరుకు చెందిన మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌లు శ్రీశైంలోని బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వారు తాండూరు నుంచి బయల్దేరి వెళ్లారు. ఉదయం సుముహూర్తములో నర్సింలు, ప్రభాకర్ గౌడ్‌లతో పాటు వారి సన్నిహితుడు ప్రేమ్ రాజ్‌లు భక్తి శ్రద్దలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలందరిని సల్లంగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. వారితో పాటు తాండూరు నుంచి రాజకీయ నేతలు, శివ భక్తులు శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో పెద్ద ఎత్తున తరలివెళ్లి పాల్గొంటున్నారు. శ్రీశైలం శివున్ని దర్శించుకుని కృపకు పాత్రులు అవుతున్నారు.
ఇదికూడా చదవండి…

