వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు…!
– ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాజీ సర్పంచ్
– బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో ఓ గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలాల ప్రకారం.. మండలంలోని కాశీంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా వెంకటయ్య పనిచేశారు. పదవి కాలం ముగియడంతో మాజీ సర్పంచ్ గా మారారు. గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీనికి తోడు కుటుంబ పరిస్థితులతో మనోవేధనకు గురయ్యాడు.

ఈ క్రమంలో వెంకటయ్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంభీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంభీకులు వెంకటయ్యను వికారాబాద్‌ తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికి ఆందోళకరంగా ఉందని కుటుంభీకులు తెలిపారు. వెంకటయ్య భార్య మతిస్థిమితంతో బాధపడుతుండగా.. కుమారుడు, కూతురు ఉన్నారు.

మరోవైపు వెంకటయ్య గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు అప్పులు తీసుకవచ్చి కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందుకోసం వెంకటయ్య దాదాపు రూ. 10లక్షల వరకు అప్పులు చేసినట్లు బందువులు తెలిపారు. చేసిన అప్పులకు ఒత్తిడిలు అధికం కావడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామంలో ప్రచారం సాగింది.

ఇదికూడా చదవండి…

రండి వృక్షార్చన చేద్దాం..!