మాణిక్ రావు సిద్దాంతలే ఆదర్శం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మాణిక్ రావు సిద్దాంతలే ఆదర్శం..!
– ఆయన స్పూర్తితో రాజకీయాలు
– కాలేజీ స్థలంపై కన్నేస్తూ ఊరుకోం
– తాండూరులో దొంగ బీసీల డ్రామా
– జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మాణిక్ రావు ఎందరో నాయకులకు రాజకీయ గురువు అని, ఆయన సిద్దాంతాలతోనే ముందుకు సాగుతున్నామని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు.

సోమవారం స్వర్గీయ మాణిక్ రావు 9వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని చించొల్లి రోడ్డు మార్గంలో ఉన్న ఆయన విగ్రహానికి రాజుగౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ మాణిక్‌ రావు అడుగు జాడల్లో ఎంతో మంది రాజకీయాలు నేర్చుకున్నారు. ఎంతటి హోదాలతో ఉన్న అదరక, బెదరక బడుగు బలహీనవర్గాల పక్షాన పోరాటం చేయాలని, వారి అభివృద్ధికి అండగా నిలవాలనే సిద్దాంతపు రాజకీయాలు నేర్పారని గుర్తుచేశారు. ఆయన సూంచిన సిద్దాంతాలతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు. ఆయన స్పూర్తిని ముందుకు తీసుకవెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
kvcs
అదేవిధంగా మాణిక్ రావు ఆస్తి కోసం పోట్లాట జరుగుతోంది. అట్టి ఆస్తిపై దొంగలు కన్నెశారని అన్నారు. అది తాండూరు యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో రియల్ ఏస్టేట్, వ్యాపారాలు అంటూ జోలికివస్తే ఊరుకోమన్నారు. బీసీల కోసం మాణిక్ రావు ఎంతో పోరాటం చేశారన్నారు. ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన కల్పించాలన్నారు. బీసీలకు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయోద్దన్నారు. దొంగ బీసీ నేతల ఆటలు సాగనివ్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు టైలర్ రమేష్‌, ఎర్రం శ్రీధర్, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు ఐకాన్ వుమెన్ సరళారెడ్డి..!