రండి వృక్షార్చన చేద్దాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రండి వృక్షార్చన చేద్దాం..!
– కేసీఆర్ జన్మదినానికి ఏర్పాట్లు
– ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
– తాండూరులో పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యురాలు కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పంజులు విఠల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చనలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములు కావాలన్నారు.

దీంతో పాటు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో అందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, గౌతాపూర్ మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, మహిళ కన్వీనర్ శకుంతల దేశ్ పాండే, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు గౌడి వెంకటేశం, పటేల్ ప్రవీణ్, శంషోద్దీన్, ఈర్షాద్, రాంలింగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవరావు, ఇంతియాజ్, గుండప్ప, జావిద్, దత్తూ, చంటీ యాదవ్, రజక నర్సింహా, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ కులాలకు అండగా బీసీ సేన..!