ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి
– మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు
– సాయిపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అభివృద్ధి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం తాండూరు పట్టణం సాయిపూర్లో ఎస్టీఎఫ్ నిధులు రూ. 20లక్షలతో సీసీ రోడ్డు, రూ. 5లక్షలతో సీసీ డ్రైన్ పనులు ప్రారంభించారు. వార్డులోని గిరిజన హాస్టల్ నుంచి సాయిపూర్ మేయిన్ రోడ్డు వరకు చేపడుతున్న పనులను మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. పార్టీలకతీతంగా అన్ని వార్డులకు నిధులు మంజూరు చేయించారని అన్నారు. ఎమ్మెల్యే సహాకారంతో వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్, అమీర్ అబ్దుల్లా, నితిన్, శ్రీనివాస్ గౌడ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మొండి బకాయిదారులపై బల్దియా దూకుడు