భాగ్యాన్ని ప్రసాధించు భద్రేశ్వరా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భాగ్యాన్ని ప్రసాధించు భద్రేశ్వరా..!
– దేవాలయ సన్నిధిలో కౌన్సిలర్లు
– భద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరికి భొగ భాగ్యాలు కలిగేలా కరణచూపు భద్రేశ్వరా అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కౌన్సిలర్లు స్వామి వారిని వేడుకున్నారు. తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డితో పాటు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, కౌన్సిలర్లు భద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఆలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు. అనంతరం తాండూరు, పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని సిద్దించేలా చూడాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు భారీ మెజార్టీతో విజయం వరించేలా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కన్వినర్ శకుంతల, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సింధూజగౌడ్, సంగీత ఠాకూర్, ఎర్రం వసంత, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అనురాధ, చంటియాదవ్, ఎర్రం శ్రీధర్, గుండప్ప తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కారు గుర్తుకే ఓటేయ్యాలే..!