మొండి బకాయిదారులపై బల్దియా దూకుడు
– ఆస్తి పన్నుల వసూళ్లపై స్పెషల్ ఫోకస్
– రెస్టారంట్, ఫంక్షన్ హాల్ దాడులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మొండి బకాయిదారులపై మున్సిపల్ అధికారులు దూకుడు పెంచారు. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నులను వసూళ్లు చేస్తున్నారు. ఆదివారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి దాడులు నిర్వహించారు. టాప్ 100 డిఫాల్టర్లలలో ఉన్న అంతారం రోడ్డు మార్గంలోని సన్ సార్ రెస్టారంట్, మెట్రో ఫంక్షన్ హాల్లలో దాడులు నిర్వహించారు. సన్ సార్ రెస్టారంట్ వద్దకు వెళ్లగా ఒక రోజు గడువులో చెల్లిస్తామని చెప్పడంతో అక్కడి నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్ కు సంబంధించి మొత్తం రూ. 12,97,594లు ఉండగా రూ.6,50,000ల చెక్కుతో పాటు రూ.1,91,320ల నగదును చెల్లంచారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రతి రోజూ మొండి దారులపై తనిఖీలు చేసి పన్నులను వసూలు చేసేందుకు దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
ఇదికూడా చదవండి…

