తాండూరు టు శ‌బ‌రి పాద‌యాత్ర‌

తాండూరు వికారాబాద్

తాండూరు టు శ‌బ‌రి
– పాద‌యాత్ర‌కు సిద్ద‌మైన అయ్య‌ప్ప స్వాములు
– 5వ తేదిన ఏర్పాట్లు చేసిన ఆల‌య క‌మిటి స‌భ్యులు

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నుంచి శ‌బ‌రిమ‌లైకి పాద‌యాత్ర‌గా బ‌య‌ల్దేరేందుకు మాల ధ‌రించిన స్వాములు సిద్ద‌మ‌య్యారు. తాండూరు ప‌ట్ట‌ణంలోని ధ‌ర్మ‌శాస్త్ర అయ్య‌ప్ప స్వామి దేవాల‌యం నుంచి ఈనెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7గంట‌ల‌కు పాద‌యాత్ర చేప‌డుతున్న‌ట్లు ఆల‌య క‌మిటి స‌భ్యులు తెలిపారు. తాండూరుకు చెందిన అయ్యప్ప స్వామి మలదారులు వరాల శ్రీనివాస్ రెడ్డి(కౌన్సిలర్), పట్లోళ్ల గంగాధర్,సంపల్లి శ్రీను,పట్లోళ్ల ప్రశాంత్,గోపాల్ గురు స్వామి,వరంగల్ అశోక్ గురు స్వామి,రాము,శ్రీనివాస్ రెడ్డి,చంద్రు,రుద్రు పటేల్,బస్వరాజ్,అజయ్,సునీల్ తదితరులు బ‌య‌ల్దేర‌నున్న‌ట్లు తెలిపారు. తాండూరు నుంచి శబ‌రి మ‌లైకు దాదాపు 1200 కిలో మీట‌ర్లు పాదయాత్రగా బయలుదేరనున్న‌ట్లు వెల్ల‌డించారు. 5వ తేదీ శుక్రవారం తాండూరు అయ్యప్ప గుడి అలయకమిటి సభ్యులు నేతృత్వంలో స్వాముల‌ను సాగ‌నంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. అదేరోజు యాలాల మండ‌లం అగ్గనుర్ సర్పంచ్ భీమప్ప గారు జుంటుపల్లి లో మధన్యభోజనం(సద్ది) ఏర్పాటు చేస్తున్నార‌ని, అనంతరం జుంటుపల్లి దగ్గర తాండూరు నుండి పెద్దఎత్తున అయ్యప్ప స్వామిలను సాగనాంపన్నున్నార‌ని తెలిపారు. కావున అయ్య‌ప్ప భ‌క్తులు స్వాములు పెద్ద ఎత్తున పాల్గొనాల‌ని కోరారు.