రంజాన్ కు ఏర్పాట్లు చేయండి..!
– అధికారులకు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల పవిత్ర పండగకు ప్రభుత్వ శాఖల తరుపున ఏర్పాట్లు చేయాలని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. గురువారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ ఎ స్ఐ రమేష్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, పట్టణ విద్యుత్ ఏఈలకు అసోసియేషన్ కార్యదర్శులు ఎండీ యూనుస్, ఖయ్యూం అతహర్, ఖయ్యూం పాషలు వినతిపత్రాలను అందజేశారు.

రంజాన్ మాసం సందర్భంగా పండ్ల వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ నుంచి మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు, తాగునీటి వసతి కల్పించేలా చూడాలన్నారు. విద్యుత్ శాఖ నుంచి విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. ఆయా శాఖల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు అసోసియేషన్ కార్యదర్శులు తెలిపారు.
ఇదికూడా చదవండి…

