
కేసుల రాజీ కోసమే లోక్ అదాలత్
– కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
– కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కేసుల రాజీకి లోక్ అదాలత్ మంచి పరిష్కార వేదిక అని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 8న తాండూరు మున్సిఫ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కరణ్ కోట్ పోలీస్టేషన్ లో 75 కేసులు ఉన్నాయని చెప్పారు. లోక్ అదాలత్ నుంచి 25 కేసులు పరిష్కారం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసులను రాజీ కుదుర్చుకోవాలని అనుకునే కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

