ట్రైన్ కిటికికీ వేలాడిన దొంగ..!
– మోబైల్ దొంగిలిస్తుండగా పట్టుకున్న ప్రయాణికులు
– కిలో మీటరు వరకు అలాగే ప్రయాణం
– లాస్ట్ జరిగిన ట్విస్ట్ తెలిస్తే దిమ్మతిరగం ఖాయం
దర్శిని డెస్క్: ఆరి తేరిన దొంగలకు కూడా అన్ని సమయాలు కలిసిరావు. కొన్ని సందర్భంగాల్లో అడ్డంగా దొరికిపోతారు. కదులు తున్న ట్రైన్‌లో నుంచి మోబైల్ దొంగిలించేందుకు యత్నించిన దొంగకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. సంఘటన తరువాత చోటు చేసుకున్న ట్విస్ట్ మాత్రం అందరికి దిమ్మ తిరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్‌పూర్ స్టేషన్‌లో ప్యాసింజర్ రైలులో ఓ మహిళా ప్రయాణికురాలి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు లోపల నుంచి ఒక ప్రయాణికుడు కిటికీలోంచి అతని చేతిని పట్టుకున్నాడు. దీంతో అతను తప్పించుకోలేకపోయాడు.
స్నాచర్‌ని మిగిలిన ప్రయాణికులు కొట్టడం ప్రారంభించారు. ట్రైన్ కిటికీకి వేలాడుతూనే దెబ్బలు తిన్నాడు. స్నాచర్ తన చేతులు విడిచిపెట్టమని ప్రయాణికులను వేడుకున్నాడు. సుమారు కిలోమీటరు వెళ్లాక చైన్ లాగి రైలును నిలిపివేశారు ప్రయాణికులు. అదే సమయంలో కొందరు వ్యక్తులు స్నాచర్‌ను రైలు నుంచి కిందకు దించి కొట్టి తీసుకెళ్లారు. ఇందులో ట్విస్ట్ ఎంటంటే అతడిని కొట్టి తీసుకెళ్లింది మరెవరో కాదు.. అతని సొంత గ్యాంగ్ సభ్యులే. ఈ సంఘటన తరువాత ఈ విషయం బయటపడింది. ఈ కింద లింక్‌లో వీడియో మీరు కూడా చూడవచ్చు.
Kalesh near Bhagalpur Bihar, a snatcher was snatching a passenger's phone from a moving train, but he could not succeed in it and the passenger caught the snatcher and carried him hanging for about a kilometer
pic.twitter.com/66wIJmzWjS— Ghar Ke Kalesh (@gharkekalesh) January 17, 2024
ఇదికూడా చదవండి…

