ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి

కెరీర్ టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి
– జిల్లా విద్యాధికారిని రేణుకా దేవి
– సాయిపూర్‌ స్కూల్లో ఏఐ ల్యాబ్ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) బోధనను పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా విద్యాధికారిణి(డీఈఓ) రేణుకా దేవి ఆదేశించారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రభుత్వ పాఠశాలను డీఈఓ రేణుకా దేవి ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తో కలిసి సందర్శించారు.

ఇటీవల పాఠశాలలో ప్రారంభించిన ఏఐ ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థులకు ఏఐతో ఏవిధంగా బోధన అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ద్వారా అందిస్తున్న బోధనపై ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఏఐ బోధనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ రామ్ మస్తా, హెచ్ఎం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి