ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం…!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం…!
– 15 నిమిషాలకే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్
– నిమిషం నిబంధన స్థానంలో కొత్త రూల్
– హాల్‌ టిక్కెట్ల పైనే సెంటర్ల లోకేషన్‌ ముద్రణ
– సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ
– తాండూరు కస్టోడియన్లు కృష్ణయ్య, కిష్టప్ప
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు కస్టోడియన్లు కృష్ణయ్య, కిష్టప్పలు తెలిపారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా తాండూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏ, బీ సెంటర్లు, సింధు బాలికల జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, భాష్యం కళాశాలతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేసీ, టీఎస్ డబ్ల్యూఆర్ కళాశాలలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో సుమారు 10 వేల 800 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో దాదాపు 9 వేల 380 మంది, ఓకె షనల్ విభాగంలో సుమారు 8వేల మంది పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. అయితే పరీక్షా కేంద్రాలలో 15నిమిషాల ముందుగానే గేట్లు మూసివేయడం జరుగుతుందని, విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల హాల్‌ టికెట్లపైనే పరీక్షా కేంద్రాల లోకేషన్ ముద్రించడం జరిగిందన్నారు. ఈ సారి పరీక్షా కేంద్రాలలో ఒక్క నిమిషం నిబంధన అమల్లో లేదని, 9గంటల తరువాత 5 నిమిషాల వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తరువాత విద్యార్థులను అనుమతించడం జరగదన్నారు.

అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఆన్‌లో ఉంటాయని, వాటి నిఘాలోనే పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఎలాంటి వాచ్‌లు, ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు తీసుకరావడం నిషేధించడం జరిగిందన్నారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ జరగకుండా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు మెడికల్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయాందోళనకు గురికాకుండా పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి