భద్రేశ్వర జాతర టెంకాయల వేలం రికార్డు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర జాతర టెంకాయల వేలం రికార్డు..!
– గత యేడాది కంటే రూ. 56వేల అధికం
– దక్కించుకున్న మహబూబ్ నగర్ జిల్లా వాసి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో నిర్వహించే టెంకాయల విక్రయాల వేలం రికార్డు స్థాయిలో జరిగింది. ప్రతి యేడాది జాతరలో విక్రయించే టెంకాయలకు వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా వచ్చేనెల 15వ తేది నుంచి ప్రారంభం కాబోతున్న జాతర ఉత్సవాలలో టెంకాయలు విక్రయించేందుకు వేలం నిర్వహించారు.

మంగళవారం దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ ల సమక్షంలో టెంకాయల వేలం నిర్వహించారు. ఈ వేలంలో మహబూబ్ నగర్ జిల్లా అల్లేపూర్ గ్రామానికి చెందిన విష్ణుమూర్తి అనే వ్యాపారి రూ. 1 లక్ష 61 వేలు అత్యధికంగా వేలం పాడి దక్కించుకున్నారు. గత యేడాది ఈ టెంకాయల వేలం రూ. 1లక్ష 5వేలు జరగగా ఈ సారి గత యేడాదికంటే రూ.56 వేలు ఎక్కువగా జరిగిందని చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వశిష్టకు స్టోన్ అసోసియేషన్ సాయం..!