ఖుషీగా ప‌రీక్ష‌లు రాయండి

కెరీర్ తాండూరు వికారాబాద్

ఖుషీగా ప‌రీక్ష‌లు రాయండి
– జూనియర్ కాలేజీకి సీలింగ్ ఫ్యాన్ల విర‌త‌ర‌ణ
– ఆర్య‌వైశ్య యువ‌జ‌న సంఘం స‌భ్యుల ఉధార‌త‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌రీక్ష‌ల‌కు ఇంట‌ర్ విద్యార్థులు ఖుషీగా ప‌రీక్ష‌ల‌ను రాయాల‌ని తాండూరు ఆర్య‌వైశ్య యువ‌జ‌న సంఘం స‌భ్యులు సూచించారు. రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం తాండూరు ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌కు సంఘం ఆధ్వ‌ర్యంలో ప‌ది సీలింగ్ ఫ్యాన్ల‌ను అంద‌జేసి ఉధార‌త‌ను చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా యువజన సంఘం అధ్యక్షులు, కౌన్సిల‌ర్ మంకాల రాఘవేందర్, కార్యదర్శి నరహరి, ఆదిత్య, భాను కుమార్ త‌దిత‌రులు మాట్లాడుతూ మండుతున్న ఎండ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండ‌రాద‌నే ఉద్దేశంతో ఫ్యాన్ల‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు. ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు ఆల్‌దిబెస్ట్ తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ శంకర్, ప్రిన్సిపల్ రాజ్ మోహన్ రావులు సంఘం స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సంఘం స‌భ్యులు శ్రీకాంత్, ఆకుల శ్రీకాంత్, రాజేష్ సార్, దాచ చందు, హరీష్, వినీత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.