పరుగెత్తిన ఖాకీ.. పట్టుకున్న ఏసీబీ..!
– కర్ణాటకలో లంచం కేసులో వింత ఘటన
దర్శిని బ్యూరో : రోడ్డుపై ఖాకీ పోలీసు అధికారి పరుగెత్తుతున్నాడు. అతని వెంటే ఏసీబీ అధికారులు కూడ పరుగెడుతున్నారు. ఇద్దరు శాఖ అధికారులు కలిసి ఎందుకు పరిగెడుతారు..? ఎవరో నిందితున్ని పట్టుకునేందుకు పరుగెడతారు..! అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ సీన్ మీ ఊహకు భిన్నంగా ఉంటుంది మరి. అసలు కథలోకి వెళితే.. లంచం తీసుకునేందుకు యత్నించిన పోలీసు అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకునేందుకు ఈ పరుగుకు అసలు కారణం. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రం తమకూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు గుబ్బిన్ తాలుకాలోని చంద్రశేఖర్ పొరా ఠాణా పోలీసులు ఓ కేసు విషయంలో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్నిపట్టుకున్నారు. దానిని విడిచిపెట్టేందుకు రూ.28 వేల లంచం ఇవ్వాలని బాధితుడితో ఒప్పందం చేసేకున్నారు. దీంతో స్టేషన్ ఎస్సై సోమశేఖర్.. అట్టి డబ్బులను వసూలు చేసేందుకు కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌ను పురమాయించాడు. బాధితుడు వెంటనే అనిశా అధికారులను ఆశ్రయించాడు. ఎస్ఐను పట్టుకునేందుకు పక్కా ప్రణాళికలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అవినీతి నిరోధక శాఖ బ్యూరో ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆమె బృందంతో కలిసి వారు ఎస్సైను పట్టుకునేందుకు వేసిన స్కెచ్‌లో భాగంగా బుధవారం చంద్రన్న నుంచి రూ.12 వేలు తీసుకుంటున్న ఆ కానిస్టేబుల్‌ను ముందుగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన కానిస్టేబుల్ లంచం తీసుకోవాలని ఎస్సైనే చెప్పినట్లు కానిస్టేబుల్ తెలిపాడు. అనంతరం అధికారులు.. కానిస్టేబుల్‌తోపాటు స్టేషన్‌కు
చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై వెంటనే తన యూనిఫాం షర్ట్‌ను అక్కడే చెత్త డబ్బాలో పారేసి, స్టేషన్ నుంచి బయటకు పరుగందుకున్నాడు. ఏసీబీ అధికారులూ ఆయన్ను వెంబడించారు. చివరకు స్థానికుల సాయంతో పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇదండి ఖాకీ పోలీసు.. ఏసీబీ అధికారుల పరుగు కథ.
వీడియో కోసం కింద చూడండి
https://www.instagram.com/p/CV2svxABuOD/?utm_source=ig_embed&ig_rid=050e5b5a-558e-4ff5-becd-62d02f41521b