దేశానికి పతకాలు సాధించాలి
– మోయిజ్ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
– గోల్డ్ మెడల్ విజేతకు అక్షర స్కూల్ సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన క్రీడాకారుడు మోయిజ్ దేశానికి పతకాలు సాధించాలని తాండూరు అక్షర స్కూల్ ప్రతినిధులు అన్నారు.

పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మోయిజ్ ఇటీవల నేపాల్ రాష్ట్రంలో జరిగిన షూటింగ్ బాల్ టోర్నమెంట్‌లో తాండూరు నుంచి తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని జాతీయ స్థాయిలో గొల్డ్ మెడల్ సాధించాడు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు అక్షర స్కూల్ ఆధ్వర్యంలో మోయిజ్‌ను ఘనంగా సన్మానించారు. పాఠశాల తరుపున ఆర్థిక ప్రోత్సహాం కూడా అందించారు. అదేవిధంగా పీడీ రాములు కూడా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ మోహన కృష్ణ గౌడ్ మాట్లాడుతూ మోయిజ్ జాతీయ స్థాయి పోటీలో రాష్ట్రానికి గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి దేశానికి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి ఉత్తమ చాంపీయన్లుగా తీర్చిద్దడం అక్షర స్కూల్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య సభ్యులు ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ కులకర్ణి, రవీందర్ రెడ్డి, మహమ్మద్ యూనస్, శోభారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


