రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీరామ నవమి శోభ

తాండూరు రాజకీయం వికారాబాద్

రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీరామ నవమి శోభ
– వైభోగంగా సీతారాముల కళ్యాణం
– పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని రాఘవేంద్ర స్వామి దేవాలయ సన్నిధిలో శ్రీరామ నవమి శోభ సంతరించుకుంది. ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని మఠంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, పరిమళ్’ గుప్త దంపతులు, మరో దంపతులు సీతారాముల తరుపున హాజరై కళ్యాణోత్సవం జరిపించారు.

వేదపండితుల మంత్రోచ్చరణల మద్య సీతారాముల కళ్యాణం కమణీయంగా జరిగింది. కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ దంపతులు మాట్లాడుతూ దేవుళ్లు మెచ్చిన సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

వినాయక వైద్య సేవలు సూపర్