మహా యోధుడు మహారాణా ప్రతాప్
– తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు
– పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహా యోధుడు మహారాణా ప్రతాప్ అని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం రాజ్ పుత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో జరిగిన వేడుకలలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు వేరు వేరుగా హాజరై మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ తొలి స్వాతంత్ర సమరయోధుడుమొఘలులతో పోరాడి భారత దేశ కీర్తిపతాకం ఎగురవేసిన తొలి హింధూ మహరాజు మహరాణా ప్రతాప్ అని గుర్తుచేశారు. ఆయన చరిత్రను అందరు తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా రాజ్ పుత్ సమాజానికి అండగా ఉంటామని, అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్, బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, రాజ్ పుత్ సమాజం అధ్యక్షులు దిలిప్ సింగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్, మహిళ సంఘం అధ్యక్షులు నిఖిత ఠాకూర్, ప్రధాన కార్యదర్శి పల్లవి ఠాకూర్, నాయకులు అజయ్ ప్రసాద్, సూరజ్ సింగ్ ఠాకూర్, సమాజం సభ్యులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

