దేశం కోసం మేము సైతం..!
– ఎన్డీఎఫ్ కు ఆర్బీఓఎల్ నుంచి రూ. 2లక్షల విరాళం
– బాధ్యతను చాటుకున్న సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశం కోసం మేము సైతం అంటూ తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు తమ బాధ్యతను చాటుకున్నారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం భారత సైన్యం ఏర్పాటు చేసిన జాతీయ రక్షణ నిధి(ఎన్డీఎఫ్)కు శుక్రవారం ఆర్బీఓఎల్ తరుపున సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళా రెడ్డి, సీఎఫ్ఎ అరవపాలి వేణు, ఉద్యోగులు రూ. 2లక్షల విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్ పహెల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం, సైన్యం విరోచితంగా చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత సైనిక కుటుంబాల సంక్షేమం కోసం భారత సైన్యం ఏర్పాటు చేసిన ఎన్డీఎఫ్ కు తమ వంతు బాధ్యతగా విరాళం అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు భారత సైన్యానికి అండగా నిలిచి కర్తవ్యాన్ని చాటుకోవాలన్నారు.

ఇదికూడా చదవండి…

