పౌష్టికాహారంతో ఆరోగ్య సమాజం
– వైస్ చైర్ పర్సన్ పల్లెళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తల్లీ బిడ్డ పొష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం జరుగుతుందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధి పాయిపూర్ 9వ వార్డులో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు గర్భిణి, బాలింతలకు పౌష్టికాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి, బాలింతలు పౌష్టికాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా పౌషికాహారం తీసుకోవడం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

తల్లీ.. బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్ వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తుందని తెలిపారు. ప్రతి రోజు పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నవీన, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

