రాములోరి కోసం కదలిన రామభక్తులు..!
– ఘనంగా శ్రీరామ మందిర పునర్ నిర్మాణ భూమి పూజ
– దేవాలయానికి ఒక్కొక్కరు రూ.50వేల విరాళం
– దాతలు సహకరించాలని కమిటి సభ్యుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిర పునర్ నిర్మాణానికి ఆలయ కమిటి సభ్యులు, స్థానిక రామ భక్తులు పూనుకున్నారు. ఆదివారం దేవాలయ ప్రాంగణంలో దేవాలయ పునర్ నిర్మాణ భూమి పూజను ఘనంగా నిర్వహించారు.

భూమి పూజ సందర్భంగా ఇందిరానగర్ కు చెందిన వెల్డర్ గోపి తన వంతుగా రూ. 50వేలను విరాళంగా అందజేశారు. ఆలయ కమిటి సభ్యులు సైతం తమ వంతుగా ఒక్కొక్కరు రూ.50వేలను విరాళంగా ప్రకటించారు. వారితో పాటు తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ దేవాలయ పునర్ నిర్మాణానికి రూ. 2లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ చాలా ఏండ్లుగా ఇందిరా నగర్ రామ మందిరం పునర్ నిర్మాణానికి దృష్టిసారించడం జరిగిందని, ఇందులో భాగంగా ఆదివారం భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈనెల 30వ తేదిన ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. రామ మందిర పునర్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాకారం అందించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

