పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ..!
– 25 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు
– విద్యాబుద్దులు నేర్పిన ఆచార్యులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో 1999-2000 వి ద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు.

25 ఏండ్ల తరువాత అందరు ఒకే చోట కలుసుకోవడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న రోజులను తలుచుకుని మురిసిపోయారు. ఆట పాటలతో ఉత్సహంగా గడిపారు. అప్పట్లో చదువు నేర్పిన ఆచార్యులు, మాతాజీలను ఘనంగా సన్మానించారు.

ఇదికూడా చదవండి…

ఎంతపని చేస్తివి డ్రైవరన్నా..!