పుర ఓటు.. పుల్ డిమాండ్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

పుర ఓటు.. పుల్ డిమాండ్…!
– ఆ వార్డులో ఒక్క ఓటుకు రూ. 3వేలు
– బంపర్‌ ఆఫర్‌గా మద్యం సీసా
– తాండూరులో చర్చనీయాంశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పుర పోరులో ఓటుకు ఫుల్ డిమాండ్ లభించినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఓ వార్డులో ఒక్క ఓటుకు రూ. 3వేలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది.

తాండూరు పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక మున్సిపల్ చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు అన్ని పార్టీల నేతలు ఎంతైనా ఖర్చు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని ఓ వార్డులో ఎన్నికల ప్రచారాలనే అట్టహాసంగా నిర్వహించారు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే పంపకాలలో అదే జోరును కొనసాగించారు. 1800ల పైకు చిలుకు ఉన్న ఆ వార్డులో ఓటర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఎలాగైనా గెలవాలనే ఓ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ. 3వేలు పంచినట్లు ప్రచారం జరిగింది. ఇదే వార్డులో బరిలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు తామేమి తక్కవ కాదన్నట్టుగా వారు కూడ రూ. 3వేలు పంచినట్లు తెలిసింది. ఓటుకు రూ. 3వేలే కాకుండా బోనస్‌గా మందు బాటిల్, అవసరమైన వారిని బిర్యానీలకు కూడా డబ్బులు పంచడం జరిగిందని మాట్లాడుకున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోటు ఇవ్వడంతో ఈ వార్డులో 1.35 కోట్ల వరకు పంపిణీ జరిగి ఉండవచ్చని స్థానికులు అంచనా వేసుకుంటున్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ పార్టీది అరాచక సంస్కృతి