ఆడపడుచులకు సర్కారు కానుక
– బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి
– ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– యాలాల మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఏర్పడ్డాకు ఆడ బిడ్డలకు ప్రభుత్వం సర్కారు కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్త ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు హాజరై మహిళలకు బతుకమ్మ చీరలనను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తుందన్నారు. పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు చీరల పంపిణీ చేస్తోందన్నారు. తాండూరు నియోజకవర్గంలో 92,200 మంది లబ్ధిదారులకు చీరల ను అందజేయడం జరగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలును ప్రవేశపెడుతున్నారని అన్నారు. మహిళలు బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాలాల జడ్పిటిసి సంధ్య రాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లా రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్, కరణం పుర్షోత్తం రావు, నర్సింలు, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, గురురాజ్ జోషి, అశోక్ రెడ్డి, సర్పంచులు బసి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
