ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
– ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు
– తాండూరు బీఆర్ఎస్వీ నేతలు
– రేవంత్ దిష్టిబొమ్మ దహనంలో కోర్టుకు హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన ఉద్యమంలో ఎన్ని కేసులు భయపడేది లేదని తాండూరు బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. గత యేడాది ఆగస్టు 2న కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలం అయ్యిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇందుకు గాను అప్పట్లో బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, దత్తాత్రేయ రావు, జిల్లా అధికార ప్రతినిధి, వినోద్ కుమార్, రజక నర్సింహులులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా సమన్లు అందుకున్న వారు మంగళవారం తాండూరు కోర్టులో హజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి మోసం చేస్తుందని ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేయించడం అమానుషం అని అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ ఇచ్చిన హామిలు, పాలనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజా సమస్యలపై జరుపుతున్న పోరాటంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని, బీఆర్ఎస్ పార్టీ తరుపున పోరాటం ఆగదని అన్నారు.

ఇదికూడా చదవండి…


