యువతకు స్ఫూర్తి క్రాంతి కుమార్..!
– గ్రూఫ్స్లో రెండు ఉద్యోగాలు సాధించడం అభినందనీయం
– సన్మానించిన తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్లు, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గూప్ – 1, గ్రూప్ – 2లలో ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించిన క్రాంతి కుమార్ యువతకు స్పూర్తిగా నిలుస్తున్నాడని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్లు, పలు పార్టీల నేతలు అభివర్ణించారు.

తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కురువ గోపాల్ కుమారుడు కురువ క్రాంతి కుమార్ ఇటీవల జరిగిన గ్రూప్ – 1, గ్రూప్ – 2 పోస్టులలో ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు. ఈ రెండు గ్రూప్స్ లలో ఏకకాలంలో రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శుక్రవారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కోట్రిక వి జయలక్ష్మీ వెంకటయ్య, సునితా సంపత్, బీవీజీ ఫౌండేషన్ అధినేత డా. సంపత్ కుమార్ పలువురు నాయుకులు క్రాంతి కుమార్ ను శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రూప్స్ లో ఏక కాలంలో రెండు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. గ్రూప్స్ లో ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు, న్యాయవాది గోపాల్, మాజీ కౌన్సిలర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, భీంసింగ్, నాయకులు వడ్డెశ్రీనివాస్, న్యాయవాది ఫరీద్, కురువ సంఘం నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

