హనుమాన్ దేవాలయ నిర్మాణానికి తోడ్పాటు
– జీవన్గీలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామంలో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామ శివారులో నూతనంగా
నిర్మిస్తున్న మందిరానికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నిర్మిస్తున్న హనుమాన్ మందిర నిర్మాణానికి తనవంతు సహాకారం అందిస్తామని హామి ఇచ్చారు. ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, నర్సిరెడ్డి, గ్రామ పెద్దలు మాణిక్యరెడ్డి, వీరారెడ్డి, మహేందర్ రెడ్డి, సత్యయ్య, రాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
